హైదరాబాద్, వెలుగు : శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సమక్షంలో మహేందర్రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మండలి చీఫ్ విప్ గా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి పట్నం మహేందర్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహేందర్ రెడ్డికి పలువురు శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ..చట్ట సభల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న మహేందర్ రెడ్డికి ఈ పదవి రావడం సంతోషకరమన్నారు.