పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ 25కు వాయిదా

కొడంగల్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై తీర్పు ఈ నెల 25కు వాయిదా పడింది. ఇరువర్గాల వాదనలు విన్న కొడంగల్ జూనియర్ సివిల్ జడ్జి తన తీర్పును రిజర్వ్ చేశారు. శుక్రవారం తీర్పు వెలువడాల్సి ఉండగా సోమవారానికి వాయిదా వేశారు. లగచర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఏ1గా ఉన్నారు. నరేందర్ రెడ్డిని కస్టడీకి తీసుకొని విచారిస్తే కేసులో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉందని పోలీసుల తరఫున పీపీ పిటిషన్​దాఖలు చేశారు.