ముగిసిన పట్నం నరేందర్​రెడ్డి పోలీస్​ కస్టడీ

  • నేడు కొడంగల్​ కోర్టులో ప్రవేశ పెట్టనున్న పోలీసులు 

వికారాబాద్​, వెలుగు: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి పోలీస్​ కస్టడీ ఆదివారంతో ముగిసింది.  కోర్టు ఆదేశాల మేరకు  పట్నం నరేందర్ రెడ్డిని వికారాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం, ఆదివారం రెండ్రోజుల పాటు విచారించారు. 

హైదరాబాద్ మల్టీ జోన్–2 ఐజీ సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ నారాయణరెడ్డి తదితరులు పట్నం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. కోర్టు ఇచ్చిన రెండ్రోజుల కస్టడీ ముగియడంతో పట్నం నరేందర్ రెడ్డిని  సోమవారం ఉదయం 10.30 గంటలకు కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.