మద్దూరు, వెలుగు: ఏ రాష్ర్టంలో లేనివిధంగా రాష్ట్రంలో అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తపల్లి మండలం పెద్దాపూర్, దుప్పటిగట్టు తదితర గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు.
వారంటీ లేని కాంగ్రెసోళ్లు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మవద్దని కోరారు. ఎన్నికల సందర్భంగా వచ్చే వారి మాయమాటలు నమ్మవద్దని కోరారు. బాల్ సింగ్ నాయక్, జనార్దన్, సర్పంచులు పాల్గొన్నారు.