= మనకు కేటీఆర్ అండగా ఉంటరు
= మీరెవరూ భయపడొద్దు.. ఎవడొస్తడో రానీ
= ఇదంతా కేటీఆర్ కు, హరీశ్ కు చెప్పిన
హైదరాబాద్: వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకట్ రెడ్డిపై దాడికి రెండు రోజుల ముందు లగచర్లలో జరిగిన నిర్వాసితుల సమావేశంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ రెడ్డి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్బంగా పట్నం నరేందర్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. సీఎం వచ్చినా... కలెక్టర్ వచ్చినా తరిమి కొడదామంటూ ఆయన పిలుపునిచ్చారు.
పట్నం నరేందర్ రెడ్డి ఏమన్నారంటే..‘ రైతుల భూములు గుంజుకొని ఫార్మా వేస్తా అంటే ఊకుంటమా.. అప్పుతెచ్చి రెండెకరాలు మూడెకరాలు కొనుక్కొన్న భూములు గుంజుకుంటరా? ముఖ్యమంత్రికి సోయిలేదా..?
ఈ ప్రజల ఓట్లు వేసుకొని, రైతుల ఓట్లు వేసుకొని ముఖ్యమంత్రిగా గెలిచినవ్ కదా. నీకు ఇంతనన్న సోయిలేదా? ఆఫీసర్లు వచ్చినా.. లీడర్లు వచ్చినా పెద్ద ఎత్తున.. మొన్న జరిగింది చిన్నదే.. పెద్ద ఎత్తున తరిమికొడదాం. గ్రామాల్లో ఎక్కడికి వచ్చినా వదలం.. ముఖ్యమంత్రి రానీ, కాంగ్రెస్ నాయకులను రానీ.. కలెక్టర్ రానీ తరిమికొడ్తం.. నేను అండగా ఉంట.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటది.. కేటీఆర్ గారు అండగా ఉంటరు.. హరీశ్ రావు గారు అండగా ఉంటరు.. కేసీఆర్ గారు కూడా అండగా ఉంటరు.. నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్పిన... ఇదంతా చెప్తే.. ఈ సారి అవసరం అనుకుంటే మనమే పోదామని చెప్పారు..
మీరు ఎక్కడా భయపడకుండ్రి, ధైర్యంగా ఉండండి.. మళ్లోసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేద్దాం.. కాంగ్రెస్ లీడర్లు వచ్చినా తరిమి తరమి కొడదాం.. పార్మా రద్దు చేసే వరకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నా’. అంటూ ఆ వీడియోలో పట్నం పేర్కొన్నారు.