![కాంగ్రెస్లో చేరిన పట్నం సునీతారెడ్డి, బొంతు రామ్మోహన్](https://static.v6velugu.com/uploads/2024/02/patnam-sunitha-mahender-red_BiDQL25Ksz.jpg)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ ఇన్ ఛార్జ్ దీపదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ ఉదయం సునీతా మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపారు.
also read : బలహీన వర్గాల బలోపేతం కోసమే కుల గణన : సీఎం రేవంత్ రెడ్డి
ఫిబ్రవరి 8న పట్నం మహేందర్ రెడ్డి దంపతులిదద్దరు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అప్పటి నుంచి వీరు పార్టీ మారుతారనే ప్రచారం జోరందుకుంది. వాస్తవానికి పట్నం మహేందర్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది. అయితే ఎన్నికలకు ముందు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవిని కొట్టబెట్టారు. దీంతో వెనక్కి తగ్గారు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ పరిధిలో నలుగురు కాంగ్రెస్ నుంచి గెలవడంతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. సునీతా మహేందర్ రెడ్డికి లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.