తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోంది: పవన్ కళ్యాణ్

తెలంగాణలో అవినీతి రాజ్యం నడుస్తోంది: పవన్ కళ్యాణ్

జనసేన అధినేత వరంగల్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో అవినీతి రాజ్యం ఏలుతుందన్నారు.  తెలంగాణ అంటేనే పొరాటాలకు కేరాఫ్ అన్నారు.  తెలంగాణ ప్రజలు కోరుకున్న రోజు పూర్తిస్థాయిలో వస్తానన్నారు.  తెలంగాణ పార్టీపై గౌరవం ఉందన్న పవన్ కళ్యాణ్ ... జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు. యువత బంగారు భవిష్యత్ కోసం పోరాటం చేస్తానన్నారు. 

గతంలో తాను ఆదిలాబాద్ లో పర్యటించినప్పుడు నీళ్లు లేని పరిస్థితి చూశానంటూ... అవినీతి రహిత తెలంగాణను కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.  తెలంగాణ కోసం ఎంతో మంచి చనిపోయరని.. జనసేన పార్టీ తెలంగాణలో ఆవిర్భవించిందన్నారు.  తెలంగాణలో  బీసీ ముఖ్యమంత్రిని చూడాలన్నారు. అవినీతికి పాల్పడే నేతలకు  పార్టీకి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు.