చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పా..: హీరో దర్శన్ కిరాతకం

చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పా..: హీరో దర్శన్ కిరాతకం

కన్నడ స్టార్ నటుడు దర్శన్‌, అతని ప్రియురాలు నటి పవిత్రగౌడ కలిసి చేసిన రేణుకాస్వామి అనే యువకుడి ప్రాణాలు హరించిన విషయం విదితమే. ఈ కేసులో ఇన్నాళ్లూ ఏమీ ఎరగనట్టు బుకాయించిన దర్శన్‌ ఎట్టకేలకు రేణుకాస్వామిపై దాడి చేసినట్లు అంగీకరించాడు. అతను పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోర్టులో దాఖలు చేసిన పోలీస్ ఛార్జ్‌షీట్‌లో ఆ వివరాలు ప్రస్తావించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పా..

తాను రేణుకాస్వామి ఛాతీ, మెడ, తలపై కొట్టానని అంగీకరించిన దర్శన్.. ప్రియురాలు పవిత్రగౌడను తన చెప్పుతో కొట్టమని సూచించినట్లు తెలిపాడు.

ALSO READ | ‘బెంగళూరు మాది మాత్రమే’.. ఒక్క వార్నింగ్తో సోషల్ మీడియా అల్లకల్లోలం

"నేను చూసే సమయానికి రేణుకాస్వామి బాగా అలసిపోయి ఉన్నాడు. అతనిపై అప్పటికే దాడి జరిగినట్లు అనిపించింది. నేను అతని మెడ, ఛాతి, తల దగ్గర తన్నాను. చెయ్యి చేసుకున్నాను. చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పాను.." అని దర్శన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు ఛార్జిషీట్‌లో ఉంది.

పవిత్రే కర్త, కర్మ, క్రియ

ఈ కేసులో నిందితురాలిగా ఉన్న పవిత్రే రేణుకాస్వామి హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఆమె ఇతర నిందితులను రెచ్చగొట్టి, వారితో కలిసి కుట్రపన్ని నేరంలో భాగమయ్యారని రుజువైనట్లు పేర్కొన్నాయి.

ఏంటి ఈ కేసు..?

పవిత్ర గౌడ అంటే ఇష్టమున్న రేణుకాస్వామి అనే యువకుడు ఆమెకు తన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న కోపంతో అతన్ని హతమార్చారు. రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్‌ అండ్ టీం అతి కిరాతకంగా హత్య చేశారు. దారుణంగా కొట్టడమే కాకుండా.. కరెంటు షాక్‌లు పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఈ కేసులో వీరు ఇప్పటికే ఊచలు లెక్కపెడుతున్నారు.