చంద్రబాబుతో పవన్‌, బాలకృష్ణ, లోకేశ్‌ ములాఖత్‌

రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా లోకేష్ కలిశారు. ములాఖత్ సందర్బంగా జైలు ఆవరణలో భద్రత పెంచారు పోలీసులు. స్కిల్ డవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజులపాటు రిమాండ్  విధించడంతో ఆయన్ను జైలుకు తరలించి విషయం తెలిసిందే.  

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు చంద్రబాబు లాయర్లు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ఎలా వేశాడని న్యాయమూర్తి ప్రశ్నించారు. పిటిషన్ పరిశీలించి లిస్టింగ్ ఇస్తామని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఇవాళ లేదా రేపు బెయిల్ పిటిషన్ విచారించే అవకాశం ఉంది.