బీహార్ లో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్‌ప్రెస్ కు భారీ ప్రమాదం తప్పింది. ముజఫర్‌పూర్ స్టేషన్ నుంచి 2023 జూలై 02 న రాత్రి ట్రైన్ ముంబైకు బయలుదేరింది. అర్థరాత్రి భగవాన్‌పూర్ స్టేషన్ కు సమీపంలో S-11 కోచ్ చక్రం పడిపోయింది.
అలాగే చక్రం విరిగినా ట్రైన్ పది కిలోమీటర్లు ప్రయాణించింది. వేగంగా వెళుతున్న రైలు భగవాన్‌పూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు ప్రయాణికులకు పెద్ద శబ్దం వినిపించింది, దీంతో వెంటనే వారు చైన్ లాగి ఆపారు.
ALSO READ:ఈ పని చేస్తే టీమిండియాదే వరల్డ్ కప్..
ఆ తర్వాత స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రైల్వే సిబ్బంది ట్రైన్ కు మరమ్మత్తులు చేశారు. అనంతరం కాసేపటికే ట్రైన్ ముదుకు కదిలింది.ప్ర
యాణికులు అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.