సినిమా హీరలంటే అభిమానం ఉండొచ్చు కానీ.. ఇప్పుడు ఆ అభిమానం హద్దులు దాటి మూర్ఖత్వాన్ని మించిపోతోంది. తాజాగా పవన్ కళ్యాణ్(Pawan kalayn) హీరోగా వచ్చిన బ్రో(Bro) సినిమా ప్రదర్శితమవుతున్న ఓ థియేటర్ ముందు అభిమాని.. పవన్ కళ్యాణ్ పై తనకున్న అభిమానాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తూ బ్లేడుతో చేతిపై పలుమార్లు కోసుకున్నాడు. పక్కన ఉన్నవారు వద్దని ఎంత అడ్డుకున్నా వాళ్ళ మాట వినిపించుకోలేదు. పవన్ కళ్యాణ్ కోసం తమ రక్తం అవసరమైతే ప్రాణం కూడా ఇస్తానంటూ హల్చల్ చేశాడు.
ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్స్ జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం కనీసం బ్రెడ్ ముక్క కూడా తెచ్చి ఇవ్వని వాడు.. పిచ్చి ముదిరి అభిమాన హీరో కోసం బ్లేడుతో కోసుకుని రక్తం చిందించాడట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో పిచ్చి బాగా ముదిరిపోయింది.. ముందు మిమ్మల్ని కనీపెంచిన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోండి అంటూ సీరియస్ అవుతున్నారు.