సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి

ఏపీలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను అడ్డుకున్నారు పవన్ అభిమానులు. కృష్ణా జిల్లా గుడివాడలో ఓ థియేటర ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రులను పవన్ అభిమానులు అడ్డుకున్నారు. ఏపీలో సినిమా ప్రత్యేక షో కు పర్మిషన్ ఇవ్వడం లేదని.. థియేటర్లపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ సినిమాలను ప్రభుత్వం కక్ష పూరితంగానే అడ్డుకుంటుందని ఆరోపించారు. మంత్రులను అడ్డుకున్న అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పేర్ని నాని పవన్ సినిమాను అడ్డుకునే ఉద్దేశ్యం తమకు లేదన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోవడం వల్ల టికెట్ ధరలకు సంబంధించిన జీవో ఆలస్యమయిందన్నారు. సినిమాలో దమ్ముంటే విజయం సాధిస్తుందని.. లేకుంటే మరో అజ్ఞాతవాసి అవుతుందని అన్నారు పేర్ని నాని. పవన్ సినిమాలను తొక్కేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

ఉక్రెయిన్ ఆయుధాలు వదిలేస్తే చ‌ర్చ‌లు జ‌రుపుతాం

రష్యా గగనతలంపై యూకే విమానాలు నిషేధం