
యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. నితిన్, భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకులు నితిన్, భరత్ మాట్లాడుతూ ‘-మేము టెలివిజన్‌లో డిఫరెంట్ షోస్ చేశాం. అప్పటినుంచి ప్రదీప్ పరిచయం. ఆయన ఫస్ట్ సినిమాకి చివరలో ఒక ప్రమోషన్ సాంగ్ షూట్ చేయాల్సి వచ్చింది.
అది మాకు ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఒకసారి ఈ స్టోరీ చెప్పాం. చాలా బాగుందన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టడం ప్లస్ అయ్యింది. కానీ ఈ సినిమాకి ఇదే యాప్ట్. ఇదొక రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఇందులో కామెడీ ఆర్గానిక్‌గా ఉంటుంది. ప్రదీప్ క్యారెక్టర్ అందర్నీ ఇంప్రెస్ చేస్తుంది. ఇక తెలుగు అమ్మాయితో హీరోయిన్ క్యారెక్టర్ చేయించాలనుకున్నాం.
దానికి తగ్గట్టే ఆడిషన్ చేసాం. ఆ పాత్రకు దీపిక పర్ఫెక్ట్‌గా ఫిట్ అయింది. తన క్యారెక్టర్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. బ్రహ్మానందం గారు. సత్య పాత్రలని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు.