Andhra Polling : మంగళగిరిలో ఓటు వేసిన పవన్, అతని భార్య

ఏపీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖులు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలోని లక్ష్మీ నగర్ కాలనీ 197 పోలింగ్ బూత్ లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యామిలీతో కలిసి ఓటు వేయటానికి పోలింగ్ బూత్ లోకి రావటంతో.. ఫ్యాన్స్ ఒక్కసారి పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చారు.

పవర్ స్టార్ అంటూ నిదానాలు చేశారు. పవన్ ఫ్యామిలీని చూడటానికి ఓటర్లు కూడా ఆసక్తి చూపటంతో గందరగోళం నెలకొంది. దీంతో ఎన్నికల సిబ్బంది వారికి నచ్చజెప్పి క్లియర్ చేశారు.