పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ 'OG'. సుజీత్(Sujeeth) డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ పై అభిమానులకి భారీ అంచనాలున్నాయి. సాహో(Sahoo) మూవీతో మంచి బజ్ క్రీయేట్ చేసిన సుజిత్.. ఇప్పుడు పవర్ స్టార్ తో OG(Orginal Gangstar) మూవీని తెరకెక్కిస్తున్నాడు.
అయితే ఈ మూవీలో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనుకున్నారు అంతా.. కానీ తాజాగా సమాచారం ప్రకారం.. ఓజి అంటే "ఓజాస్ గంభీర" అని తెలుస్తోంది. ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉండటంతో.. పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇక సాహో మూవీలో ప్రభాస్ కు సిద్ధార్థ్ నందన్ సాహో గా స్టైలీష్ లుక్ లో ప్రెజెంట్ చేసిన సుజీత్ .. ఇప్పుడు OG లో పవన్ కళ్యాణ్ ను ఓజాస్ గంభీరగా మోస్ట్ వైలెంట్ గా చూపించనున్నాడని సమాచారం.
ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. తమిళ నటుడు అర్జున్ దాస్(Arjun Das), శ్రియ రెడ్డి(Shreya Reddy), ప్రకాష్ రాజ్(Prakash Ra) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) విలన్ గా నటిస్తున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్ వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత దానయ్య(Daanayya) నిర్మిస్తున్న ఈ సినిమాకు.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.