పవన్ ‘ఉస్తాద్​ భగత్​ సింగ్’ షూటింగ్​ స్టార్ట్​

పవన్ ‘ఉస్తాద్​ భగత్​ సింగ్’ షూటింగ్​ స్టార్ట్​

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ స్టార్ట్​ చేశాడు. హరీష్ శంకర్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుందగా.. మరో దర్శకుడు దశరథ్ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, కథ అందిస్తున్నారు. సినిమా షూటింగ్ హైదరాబాద్ శివారులోని అల్యూమినియం ఫ్యాక్టరీలో మొదలెట్టారని తెలుస్తోంది. అక్కడ ఒక ఫైట్​ సీన్ తీయనున్నారు.

డైరెక్టర్​ హరీష్ శంకర్.. ఇద్దరు మిత్రులు సినిమాలోని శోభన్ బాబు ఉన్న సాంగ్​క్లిప్ ట్వీట్ చేశాడు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్నినాళ్లు దాచిన హృదయం.. ఇంకా తెలవారదేమి.. అన్న పాట పెట్టాడు. అయితే పవన్​తర్వాత డైరెక్టర్​సుజిత్ సినిమా ఓజి, మరో దర్శకుడు క్రిష్ సినిమా 'హరిహర వీరమల్లు' కూడా ఇంకా చేయాల్సి ఉంది.