Bro motion poster: దేవుడి టైం స్టార్ట్.. పవన్ "బ్రో" వచ్చేస్తున్నాడు

Bro motion poster: దేవుడి టైం స్టార్ట్.. పవన్ "బ్రో" వచ్చేస్తున్నాడు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా వస్తున్న లేటెస్ట్ మూవీకి "బ్రో"  అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. దీనికి సంబందించిన మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్ లో పవన్ మోస్ట్ స్టైలీష్ గా కనిపిస్తున్నాడు. ఈ మోషన్ పోస్టర్ కు థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దుమ్ము రేపింది. కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం అనే శ్లోకంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. పవన్ కళ్యాణ్ క్లాస్ స్వాగ్ అదిరిపోయింది. పోస్టర్లో వెనుక గడియారాన్ని చూపిస్తూ.. పవన్ అల్ట్రా స్టైలీష్ లుక్ ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

ఈ సినిమా జులై 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా మెగా హీరోలకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

https://www.youtube.com/watch?v=wrVIS00ljJ4