పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ సినిమా పాకిస్తాన్లో ట్రెండింగ్‌గా మారింది. ఒక్క పాక్‌లోనే కాదు బంగ్లాదేశ్‌లోనూ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటీవల బ్రో సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
లేటెస్ట్గా ఆగస్టు 21 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఈ మూవీ ఇండియాలో నం.1 స్థానంలో ఉంది. నాన్ ఇంగ్లిష్ సినిమాల లిస్ట్‌లో టాప్7లో నిలిచింది. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో టాప్ 8లో ఉంది.
ఇందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్‌గా మారాయి. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ మూవీకి త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లేను అందించారు