ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నికలకు మరో రెండు వారాలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయం వేడెక్కింది. అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీల నుండి ఉమ్మడి మేనిఫెస్టో ఇంకా విడుదల కావాల్సి ఉంది. కొత్త పథకాలేవి లేకుండా ఉన్న పథకాలకే నగదు పెంచి జగన్ మేనిఫెస్టో ప్రకటించగా కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఎలా ఉంటుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎల్లుండి ( మంగళవారం ) కూటమి మేనిఫెస్టో విడుదల ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్. ఏలేశ్వరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు. మోడీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్ కు భయమని అన్నారు. జగన్ మోడీ దగ్గరకు వెళ్లి కేసులు కొట్టేయమని అడుగుతారని అన్నారు. తనకు అవినీతి చేయాల్సిన అవసరం లేదని, మోడీతో దైర్యంగా మాట్లాడగలని అన్నారు పవన్.