2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి 7రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో తునిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అంటే 3కబ్జాలు, 6సెటిల్మెంట్లు అన్నట్లు తయారయ్యిందని అన్నారు.
ఈ ప్రభుత్వం మారాలని భావించాను కాబట్టే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రశ్నిస్తే కేసులు పెట్టారని, పోరాడితే కేసులు పెట్టారని అన్నారు. గోతులు, దాడులు తప్ప, ఈ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. మంత్రి అంబటి రాంబాబు పోలవరం గురించి అడిగితే తనకు తెలీదని అంటాడు, సినిమాల్లో ఉన్న మేము డ్యాన్స్ చేస్తాం, మంత్రిగా ఉండి అంబటి ఎలా డ్యాన్స్ చేస్తారని అన్నారు.