తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి జనసేన అధినేత, నటుడు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పనవ్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వపన్ అన్నారు.
సీఎంగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ యువనేత నారా లోకేష్ హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్ విజయంగా పాలన సాగించాలని ఆయన అన్నారు.
Congratulations and best wishes to @revanth_anumula Garu on taking the oath as Telangana's Chief Minister. Wishing him a successful tenure. pic.twitter.com/shbs2umhTg
— Lokesh Nara (@naralokesh) December 7, 2023
డిసెంబర్ 7వ తేదీ గురువారం ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి చేత గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకరం చేయగా.. సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలతోపాటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తదితర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ @revanth_anumula గారికి శుభాకాంక్షలు - JanaSena Chief Shri @PawanKalyan#TelanganaCM#RevanthReddy pic.twitter.com/Q4mvl2Ux9O
— JanaSena Party (@JanaSenaParty) December 7, 2023