స్టాలిన్ ను అభినందించిన పవన్ కళ్యాణ్

  • మాటల్లో కాదు.. చేతల్లో చూపిస్తున్నారు
  • మీ పనితీరు దేశానికే మార్గదర్శకం: పవన్ కళ్యాణ్ 

అమరావతి: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ ను అభినందనలతో ముంచెత్తారు. ఎన్నికల్లో విజయం సాధించి సీఎంగా అధికారం చేపట్టాక ప్రజల సంక్షేమం కోసం.. ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యతనిచ్చేలా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి అభినందనీయమని.. మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్నాని ప్రశంసించారు. ఈ మేరకు ట్విట్టర్ లో అభినందనలు తెలియజేస్తూ.. ‘‘ఏ పార్టీ అయినా ప్రభుత్వంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ.. ప్రభుత్వంలోకి వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారు. మీ పరిపాలన, మీ ప్రభుత్వ పనితీరు మీ ఒక్క తమిళనాడు రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకం.. స్ఫూర్తి దాయకం. మీకు మనస్పూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు..’’ అని ట్వీట్ చేశారు.