జనసేన అభ్యర్థులకు బీ ఫారంలు... పవన్ నామినేషన్ ఎప్పుడంటే..

2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సంపిస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించి ప్రచారం ముమ్మరం చేయటంతో ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ఇక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం వెలువడనున్న నేపథ్యంలో నేతలంతా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థులకు బీ ఫారంలు అందజేశారు.

బుధవారం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో అభ్యర్థులకు బీ ఫారంలు అందించారు పవన్. ఆ తర్వాత బీ ఫారంలు అందుకున్న అభ్యర్థులతో ప్రమాణం చేయించారు పవన్. తనతో పాటు 20మంది అసెంబ్లీ అభ్యర్థులకు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బీఫారంలు అందించిన పవన్ ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రచారం చేయాలని సూచించారు. కాగా, ఈ నెల 22న పిఠాపురంలో పవన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.