వరుణ్, లావణ్య పెళ్లికోసం ఇటలీ బయల్దేరిన పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ

టాలీవుడ్ లవ్ బర్డ్స్ వరుణ్ తేజ్(Varun tej), లావణ్య త్రిపాఠి(Lavanya tripathi) పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. నవంబర్ 1న ఇటలీలో ఘనంగా జరగనుంది వీరి పెళ్లి. అనంతరం నవంబర్ 5న హైదరాబాద్ లో భారీగా రెసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇక ఈ మెగా వేడుక కోసం మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ ఇప్పటికే ఇటలీకి బయలుదేరారు. దీనికి సంబందించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

Also Read :- అడ్డంగా దొరికిపోయిన శ్రీలీల

ఇక తాజాగా వరుణ్, లావణ్యల పెళ్లి కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan).. భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva)తో కలిసి ఇటలీకి బయలుదేరాడు. వీరితోపాటు అల్లు ఫ్యామిలీ కూడా ఉన్నారు. శనివారం(అక్టోబర్ 28) ఉందయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్తారా అనే అనుమానాలు నిన్నమొన్నటివరకు ఉన్నాయి. తాజా పరిణామంతో ఆ అనుమానాలకు పులిష్టాప్ పడింది.