470 కేజీల వెండితో పవన్ చిత్రం.. పవన్ ఫ్యాన్సా మజాకా!

ప్రెజెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) కు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవల్. ఆయనను ఒక స్టార్ గా కంటే దేవుడిలా కొలిచేవాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయన క్రేజ్ మ్యాచ్ చేయడం అంటే అంతా ఈజీ కాదు. ఇటు సినిమాలు, అటు రాజకీయాలు.. ఎక్కడైనా అయన ఫాలోయింగ్ ఆన్ మ్యాచబుల్ అంతే.

తాజాగా ఇదే విషయాన్నీ ఆయన అభిమానులు మరోసారి ప్రూవ్ చేశారు. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు అన్న విషయం అందరికి తెలిసిందే. ఈ సంధర్బంగా తమ అభిమాన హీరో కోసం ఒక అరుదైన బహుమతి ఇవ్వాలని భావించారు పవన్ ఫ్యాన్స్. ఇందులో భాగంగానే 470 కేజీల వెండి ఆభరణాలతో పవన్ కళ్యాణ్ రూపాన్ని రూపొందించి వావ్ అనిపించారు. ఇందుకోసం ఏకంగా  3కోట్ల 71లక్షల 30వేల రూపాలు ఖర్చు చేశారు. ఇక ఈ మొత్తం ఆర్ట్ వర్క్ ని  వీడియో తీసి.. దాన్ని జనసేన లీడర్ నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. చాలా అద్భుతంగా ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్.. నీ క్రేజ్ ను మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు పవనన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.