ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో నేతలంతా ఒక పక్క ప్రచారంతో మరో పక్క నామినేషన్లతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే పులివెందుల నుండి వైఎస్ జగన్ తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి, చంద్రబాబు తరఫున కుప్పంలో భువనేశ్వరి నామినేషన్లు దాఖలు చేశారు.
పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు చాలా కీలకం అని చెప్పాలి. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్, ఈసారి ఎలా అయినా గెలవాలన్న కసితో ఉన్నారు. అయితే, వైసీపీ అభ్యర్థి వంగ గీతకు పిఠాపురంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న కారణంగా పవన్ స్థానిక టీడీపీ నేత వర్మ మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి, ఈ హోరాహోరీ పోరులో పిఠాపురం ఓటరు ఎవరి వైపు నిలుస్తారో చూడాలి.