వీరమల్లు వాయిదా.. మేలో విడుదల

వీరమల్లు వాయిదా.. మేలో విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌.  దర్శకుడు  క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా,  జ్యోతి కృష్ణ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నాడు.  మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. హోలీ సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు కొత్త రిలీజ్‌‌‌‌‌‌‌‌ డేట్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారు.  వాస్తవానికి ఈ చిత్రాన్ని మార్చి 28న రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేయగా, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నందున విడుదలను వాయిదా వేశారు.  

రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌ను సమ్మర్ కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలియజేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పవన్ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌తో పాటు హీరోయిన్ నిధి అగర్వాల్, నటులు సునీల్, నాజర్, రఘు బాబు, సుబ్బరాజు గుర్రాలపై కనిపిస్తూ ఆకట్టుకున్నారు. ఇందులో పవన్  చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జిషుసేన్ గుప్తా  ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.  ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.