HariHaraVeeraMallu: హరి హర వీరమల్లు 'మాట వినాలి' సాంగ్ రిలీజ్.. పవన్ కళ్యాణ్ పాడిన పాట విన్నారా?

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ (PawanKalyan) హీరోగా హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu) మూవీ రూపొందుతోంది. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పాడిన పాటను విడుదల చేశారు మేకర్స్.

ఇవాళ జనవరి 17న 'మాట వినాలి' అనే హరి హర వీరమల్లు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. 'మాట వినాలి గురుడ మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి. ఉత్తది కాదు మాట తత్తరపడక .. చిత్తములోన చిన్న ఒద్దిక ఉండాలి..' అనే లిరిక్స్ పవన్ గొంతుకి గాంభీర్యాన్ని ఇచ్చాయి. ఆస్కార్ విన్నర్ ఎమ్ ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ గీతాన్నికి పెంచల్ దాస్ సాహిత్యం అందించారు.

పవన్ కళ్యాణ్ పాడిన ఈ పాట కోసం ఆయన ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సాంగ్ జనవరి 6న రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడి, ఇవాళ జనవరి 17న రిలీజ్ అయింది. 

పవన్ కెరీర్ లో మెదటి పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)  కొంత భాగం తెరకెక్కించగా..ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

ALSO READ | సైఫ్‌‌ అలీఖాన్‌‌కు కత్తిపోట్లు..అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి ఆరు చోట్ల పొడిచి పరారైన దుండగుడు

ఇందులో పవన్ పోరాట యోధుడిగా కనిపించనున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్.. ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నర్గిస్ ఫక్రి, పూజిత పొన్నాడ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమా మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.