HariHaraVeeraMallu: పవన్ కల్యాణ్ గాత్రంతో హరి హర వీరమల్లు ఫస్ట్ సాంగ్.. వచ్చేది అప్పుడే!

HariHaraVeeraMallu: పవన్ కల్యాణ్ గాత్రంతో హరి హర వీరమల్లు ఫస్ట్ సాంగ్.. వచ్చేది అప్పుడే!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu). లాంగ్ గ్యాప్ తర్వాత సెప్టెంబర్ 23 నుంచి ఈ మూవీ షూటింగ్ షురూ చేశారు మేకర్స్. ఈ పెస్టిజియస్ మూవీ పార్ట్ 1- 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ఈ క్రమంలో హరిహర వీరమల్లు నుంచి త్వరలో ఓ క్రేజీ అప్డేట్ రానున్నట్లు సమాచారం. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ దీపావళి సందర్భంగా అక్టోబర్ చివర్లో తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి బృందం ఇప్పటికే సాంగ్ కూడా కంప్లీట్ చేశారంట.

అంతేకాదు.. ఈ సాంగ్ ను హీరో పవన్ కల్యాణ్ స్వయంగా పాడినట్లు టాక్. గతంలోనూ పవన్ కళ్యాణ్ కొన్ని చిత్రాల్లో పాటలు పాడి ఆడియన్స్ ను ఉర్రుతలు ఊగించారు. దీంతో  ప్రస్తుతం హరిహర వీరమల్లుపై మరింత ఆసక్తి పెంచుతోంది. 

Also Read:-దేవర గ్రాండ్ సక్సెస్ మీట్ జరగనుంది! ఎక్కడంటే?

హరిహర వీరమల్లుసినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. హరి హర వీరమల్లు మూవీలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్.. ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‍గా చేస్తున్నారు.

పవన్ కెరీర్ లో మెదటి పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)  కొంత భాగం తెరకెక్కించగా..ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.