
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) చేస్తున్న మోస్ట్ ప్రేస్టీజియస్ ప్రాజెక్టులలో హరి హరి వీరమల్లు(Hari Hara Veeramallu) ఒకటి. పీరియాడికల్ డ్రామాగా పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను శ్రీ సూర్య మూవీస్ పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. అందుకే ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు నుండి దర్శకుడు క్రిష్ తప్పుకుంటున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆయన స్థానంలో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ ఆ బాధ్యతలను తీసుకున్నట్లు కూడా ఇటీవల ప్రకటించారు. ఇక అప్పటినుండి ఈ ప్రాజెక్టు పై పవన్ కళ్యాణ్ అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే.. తాజాగా ఫ్యాన్స్ కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు నిర్మాత ఏఎం రత్నం.
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. క్రిష్ ఈ సినిమా నుండి తప్పుకున్నమాట నిజమే. అందరికి సానుకూలంగా ఉండాలనే ఆ నిర్ణయం తీసుకున్నాము. ఇక ఆయన స్థానంలో నా కుమారుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాను పూర్తి చేస్తాడు. నేను కూడా రచయితనే, మరోపక్క కళ్యాణ్ గారికి కూడా దర్శకత్వంపై అవగాహన ఉంది. జ్యోతి కృష్ణకి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సలహాలు అందించడానికి మేము ఉన్నాము. త్వరలోనే సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము.. అని చెప్పుకొచ్చాడు ఏఎం రత్నం. మరి ఇన్ని మార్పుల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.