
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’.దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్‌ను చిత్రీకరిస్తున్నాడు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. శుక్రవారం (మార్చి 21న) డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టినట్టు మేకర్స్ తెలియజేశారు. ఫుల్ స్వింగ్‌లో డబ్బింగ్ వర్క్ జరుగుతోందని, అన్‌మ్యాచ్డ్ హీరోయిజంతో పవన్ రాబోతున్నారని పోస్ట్ చేశారు.
రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో సమ్మర్ కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి నుంచి మే 9 వరకు కేవలం 49 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ లోపు షూటింగ్, సీజీ వర్క్, డబ్బింగ్, రీ-రికార్డింగ్, ఎడిటింగ్ వంటి అన్ని పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందా అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
#HariHaraVeeraMallu dubbing in full swing, the journey of UNMATCHED HEROISM is inching closer to the silver screen! 🎙️🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) March 21, 2025
Mark the date - May 9th, 2025. #HHVMonMay9th 💥💥
POWERSTAR @PawanKalyan @AMRathnamOfl @thedeol #SatyaRaj @AgerwalNidhhi @amjothikrishna @mmkeeravaani… pic.twitter.com/yEJgleiiAh
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, నాజర్, రఘు బాబు, సుబ్బరాజు, జిషుసేన్ గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.