HariHaraVeeraMallu: హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ కళ్యాణ్..రిలీజ్ డేట్ అనౌన్స్

HariHaraVeeraMallu: హరిహర వీరమల్లు షూటింగ్లో పవన్ కళ్యాణ్..రిలీజ్ డేట్ అనౌన్స్

గత కొద్ది నెలలుగా పవర్ స్టార్ పవన కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సినిమా షూటింగులకు బ్రేక్ ఇచ్చాడు. అయితే పవన్ కొత్త చిత్రాలకి కమిట్ అవ్వకపోయినప్పటికీ గతంలో సంతకం చేసిన చిత్రాలను పూర్తే చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు(Hari Hara Veeramallu) ఇవాళ సోమవారం సెప్టెంబర్ 23న షూటింగ్ షురూ చేశారు మేకర్స్.ఈ పెస్టిజియస్ మూవీ రిలీజ్ డేట్‌ను కూడా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. పార్ట్ 1ను 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ‘మెగా సూర్య ప్రొడక్షన్’ ఎక్స్‌లో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

‘2025 మార్చి 28న అన్‌స్టాపబుల్‌ ఫోర్స్‌, అన్‌బ్రేకబుల్‌ స్పిరిట్‌ హరిహర వీరమల్లు పార్ట్ 1 రిలీజ్ అవుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూట్‌లో జాయిన్ అయ్యారు. హరిహర వీరమల్లు షూటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు విజయవాడలో వేసిన సెట్‌లో తిరిగి ప్రారంభమైంది’ అని మెగా సూర్య ప్రొడక్షన్ తన ఎక్స్‌లో వెల్లడించింది. 

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో కలసి హాలీవుడ్ లెజెండ్ నిక్ పావెల్ స్టంట్ డైరెక్షన్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ సన్నివేశాలను తెరకెక్కించబోతున్నట్లు ఇదివరకే నిర్మాత ఏఎం రత్నం వెల్లడించాడు. ఇక ఈ తాజా అప్డేట్ తో పవర్ స్టార్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

హరిహర వీరమల్లుసినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అంతేకాదు ఈ సినిమా నుండి రిలీజైన గ్లింప్స్‌, టీజర్ ఆ అంచనాలను ఆకాశానికెత్తేసింది. అందుకే ఈ సినిమా గురించి వస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండ్ అవుతోంది. 

పవన్ కెరీర్ లో మెదటి పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ పెస్టిజియస్ సినిమాను మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి (Krish)  కొంత భాగం తెరకెక్కించగా..ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.