Pawan Kalyan: గురువు మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో పవన్ కళ్యాణ్

Pawan Kalyan: గురువు మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న హీరో పవన్ కళ్యాణ్

తన మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సేని మృతికి నటుడు పవన్ కళ్యాణ్ Xవేదికగా భావోద్వేగ నివాళులర్పించారు. షిహాన్ హుస్సేని మంగళవారం (2025 మార్చి 25న) క్యాన్సర్‌తో మరణించారు. తాజాగా ఆయన మృతి పట్ల పవన్ కళ్యాణ్ ఎమోషనల్ నోట్ రాశారు. 

పవన్ కళ్యాణ్ మాటల్లోనే.. "ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ మరియు ఆర్చరీ కోచ్ షిహాన్ హుస్సేని మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. నేను అతని నుండి కరాటే నేర్చుకున్నాను. నాలుగు రోజుల క్రితం క్యాన్సర్‌తో అతని పోరాటం గురించి విన్నాను. చెన్నైలోని నా స్నేహితుల సహాయంతో, చికిత్స కోసం అతన్ని విదేశీ ఆసుపత్రికి పంపడానికి ఏర్పాట్లు చేస్తానని అతని కుటుంబ సభ్యులతో చెప్పాను. అలాగే, మార్చి 29న చెన్నైలో అతన్ని కలవాలని కూడా అనుకున్నాను. అతని మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. అతని ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని సంతాపం తెలిపారు. 

ALSO READ | పవన్‌ కల్యాణ్‌ కరాటే గురువు కన్నుమూత.. చివరి కోరిక నెరవేర్చాలని పవన్‌ను అభ్యర్థించిన హుస్సేని

తన కరాటే కోచింగ్ రోజులను గుర్తుచేసుకుంటూ, "ఆయన మార్గదర్శకత్వంలో నేను నేర్చుకున్న క్రమశిక్షణ మరియు నైపుణ్యాలు నన్ను శారీరకంగా మరియు మానసికంగా తీర్చిదిద్దాయి. ఆయన తీవ్రమైన శిక్షణ నాలో ధైర్యం మరియు దృఢ సంకల్పాన్ని నింపింది, అది నన్ను నిరంతరం నడిపిస్తుంది. మార్షల్ ఆర్ట్స్ విలువిద్య మరియు లలిత కళలలో ఆయన వారసత్వం ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఆయన బోధనలు భవిష్యత్తుకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఈ మాటలు రాస్తున్నప్పుడు నా హృదయంలో లోతైన నొప్పితో కన్నీటి చుక్కలు కారుతున్నాయి" అంటూ పవన్ ఎమోషనల్ నోట్ రాశారు.

షిహాన్‌ హుసైని పవన్ కళ్యాణ్ కు కరాటేలో శిక్షణ ఇచ్చాడు. అలాగే దళపతి విజయ్‌ కూడా ఆయన వద్దే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ముఖ్యంగా పవన్‌ ఆయన వద్దే మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు కరాటే, కిక్‌ బాక్సింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. షిహాన్ హుస్సేని సినిమాల్లో నటించడమే కాకుండా, ఆయన అనేక రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా మరియు వ్యాఖ్యాతగా కూడా కనిపించారు. యుద్ధ కళలు మరియు విలువిద్యలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన బహుముఖ ప్రజ్ఞాశాలి హుస్సేని.