Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లుపై కీలక అప్‌డేట్.. ఫైనల్ షెడ్యూల్‌‌లో పవన్ కళ్యాణ్‌

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లుపై కీలక అప్‌డేట్.. ఫైనల్ షెడ్యూల్‌‌లో పవన్ కళ్యాణ్‌

ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే మరోవైపు కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ముందుగా ఆయన నుంచి రాబోతున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.

తాజాగా ఈ షెడ్యూల్‌‌లో పవన్ కళ్యాణ్‌‌ జాయిన్ అయ్యారు. ఆయనతో పాటు కీలక పాత్రధారులంతా పాల్గొంటున్నారు.  చిత్రంలోని  అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌‌తో షూటింగ్  మొత్తం పూర్తి కానుంది. జ్యోతికృష్ణ దర్శకత్వంలో  రూపొందుతోన్న ఈ చిత్రంలో చారిత్రాత్మక యోధుడి పాత్రలో  పవన్ కనిపించనున్నారు.

 నిధి అగర్వాల్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. బాబీ డియోల్  కీలక పాత్ర పోషిస్తుండగా,  అనుపమ్ ఖేర్, నాజర్, రఘుబాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ‘హరి హర వీర మల్లు’ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్‌గా పార్ట్‌1 ను మార్చి 28న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేస్తున్నారు.