పోసానిపై పరోక్షంగా స్పందించిన పవన్ కళ్యాణ్

సినీనటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తనపై చేసిన కామెంట్స్ పై పవన్‌ కళ్యాణ్‌ తనదైన శైలిలో పరోక్షంగా స్పందించారు. ఏనుగులా తాను ఘీంకారం చేస్తే.. ఇలాంటి స్పందన సహజమే అనే అర్థం వచ్చేలా..  'ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమే'నని ట్వీట్‌ చేశారు. హైదరాబాద్ లో పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం పాయింట్స్ టీవీ ఛానెళ్లలో ప్రముఖంగా రావడం ఆయన దృష్టికి వెళ్లినట్లుంది. పోసాని సమావేశం పూర్తయిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ నాలుగు లైన్లు ట్వీట్‌ చేశారు. పవన్ ట్వీట్ ఇలా ఉంది.. 
''తుమ్మెదల ఝుంకారాలు
నెమళ్ళ క్రేంకారాలు
ఏనుగుల ఘీంకారాలు
వైసీపీ గ్రామసింహాల గోంకారాలు
సహజమే …''