
ఇటీవల జరిగిన ఏపీలో ఎన్నికల్లో ఎన్డీయే(టీడీపీ,జనసేన,బీజేపీ) కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక జనసేన విషయానికి వస్తే.. పోటీచేసిన 21 ఎమ్మెల్యే, ర2 ఎంపీ స్థానాల్లో గెలిచి సత్తా చాటింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు తన భార్య అన్నా లెజినోవా, కొడుకు అకిరా నందన్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు పవన్ కళ్యాణ్.
ఈ క్రమంలోనే కొడుకు అకీరా నందన్ ను ప్రధానమంత్రి మోదీకి పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మోదీ అకిరా నందన్ భుజంపై చేయి వేసి మాట్లాడుతున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వారసుడు సిద్ధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ కానున్న నేపధ్యంలో వారసుడు ఎంట్రీకి సర్వం సిద్ధం చేస్తున్నారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అందుకే గతంలో ఎన్నడూ లేనంత విదంగా ఈ మధ్య మీడియా ముందు కనిపిస్తున్నారు అకిరా. మరి నిజంగానే అకిరా సినిమాల్లో అడుగుపెడతారు అనేది చూడాలి.