టీడీపీ,జనసేన కూటమిలో భాగంగా 24 అసెంబ్లీ, 3ఎంపీ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ అభ్యర్థులను ఖరారు చేయటం కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 5స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ మిగతా స్థానాల కోసం సమర్థవంతమైన అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నాడు. ఈ క్రమంలో పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ బరిలో పోటీకి దిగనున్నాడని ప్రచారం ఊపందుకుంది.
అయితే, తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి నాగబాబును బరిలో దింపాలన్న ఆలోచనను పవన్ విరమించుకున్నాడని తెలుస్తోంది. అనకాపల్లి అసెంబ్లీ స్థానాన్ని ఆశిస్తున్న కొణతాల నాగబాబు పట్ల అసంతృప్తిగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ లో నాగబాబు చేస్తున్న సమీక్షలకు కొణతాల నుండి సహకారం అందట్లేదట అందుకే నాగబాబును అనకాపల్లి కాకుండా వేరే చోటు నుండి బరిలో దింపేందుకు కసరత్తు చేస్తున్నాడట పవన్.
గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్న అనకాపల్లి నుండి కాకుండా పట్టాన ప్రాంతం ఎక్కువగా ఉన్న విశాఖ లాంటి స్థానాలను నాగబాబుకు కేటాయించే దిశగా పవన్ ఆలోచిస్తున్నాడని సమాచారం అందుతోంది. అయితే విశాఖలో సమీకరణాలు నాగబాబు పోటీకి అనుకూలించే అవకాశం లేకపోవటంతో మరొక అనువైన స్థానం కోసం చూస్తున్నాడట పవన్ కళ్యాణ్.