క్యాన్సర్ తో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కరాటే కోచ్.. మెడికల్ కాలేజీకి ఆర్గాన్స్ డొనేట్

క్యాన్సర్ తో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ కరాటే కోచ్.. మెడికల్ కాలేజీకి ఆర్గాన్స్ డొనేట్

కరాటే మార్షల్ ఆర్ట్స్ కోచ్ షిహాన్ హుస్సేని తన శరీర అవయవాలని దానం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.  ప్రస్తుతం తాను బ్లడ్ క్యాన్సర్, అప్లాస్టిక్ అనీమియా వ్యాధులతో బాధ పడుతున్నాని తరచుగా రక్త మార్పిడి చికిత్స అవసరమవుతుందని తెలిపాడు. ఇక తన మరణాంతరం తన డెడ్ బాడీ ని తన కరాటే అసోసియేషన్ ఫౌండర్ అయిన రామసామి ఉదయార్ కు నివాళిగా శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీకి అప్పగించాలని ఆయన కోరికను వ్యక్తం చేశారు.

అయితే  షిహాన్ హుస్సేని దాదాపుగా 4 వందల మందికి పైగా స్టూడెంట్స్ ని మార్షల్ ఆర్ట్స్ లో తీర్చి దిద్దారు. అంతేకాదు తమిళ్ స్టార్ హీరో విజయ్ బద్రీ(టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు మూవీ రీమేక్) సినిమాలో కరాటే కోచ్ గా నటించాడు. రియల్ లైఫ్ లో కూడా ఈ ఇద్దరి హీరోలకి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇచ్చాడు. అందుకే తన మరణాంతరం డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి అప్పగించే విషయంలో విజయ్, పవన్ కళ్యాణ్ సహాయం తీసుకోవాలని కూడా సూచించాడు.  దీంతో నెటిజన్లు కోచ్ షిహాన్ హుస్సేని ని అభినందిస్తున్నారు. తన మరణాంతరం కూడా అవయవాలు ఇతరులకి ఉపయోగపడాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read : పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు రీతూ చౌదరి

ఈ విషయం ఇలా ఉండగా షిహాన్ హుస్సేని గతంలో తన వైద్య ఖర్చుల కోసం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ని విక్రయించాలని ప్రయత్నాలు చేశాడు. కానీ షిహాన్ హుస్సేని మార్షల్ ఆర్ట్స్ విభాగంలో అందించిన సేవలు గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం వైద్య ఖర్చులకి కావాల్సిన ఆర్ధిక సాయం అందిస్తోంది.

షిహాన్ హుస్సేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తన మార్షల్ ఆర్ట్స్ స్కూల్ కి తరచుగా వచ్చే వాడని కళ్యాణ్ కుమార్ గా ఉన్న అతడికి పవన్ అని పేరు పెట్టానని తెలిపాడు. అలాగే పవన్ చాలా చురుకుగా ఉండేవాడని తనకి చాలా ఇష్టమైన స్టూడెంట్ అని చెప్పుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ కి మార్షల్ ఆర్ట్స్ ని అన్ని చోట్లకి తీసుకెళ్లాలని ఉండేదని తన మరణాంతరం మార్షల్ ఆర్ట్స్ స్కూల్ ని కొని అభివృద్ధి చెయ్యాలని కోరాడు. దీంతో షిహాన్ హుస్సేని చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్, సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో బిజీగా ఉన్న పవన్ ఈ విషయంపై ఎలా స్పందిస్తాడో చూడాలి.