వారాహి ఏకాదశ దీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ 11రోజుల వారాహి దీక్ష చేపట్టారు. వారాహి అమ్మవారి దీక్షలో భాగంగా పవన్ కళ్యాణ్ ఇవాళ ( జూలై 5, 2024 ) ఆదిత్య ఆరాధన పూజ నిర్వహించారు.  ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 26న వారాహి దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ దీక్షలో భాగంగా కేవలం పళ్ళు, ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటున్నారు.

 

వారాహి అమ్మవారిని ఇష్టదైవంగా భావించే పవన్ కళ్యాణ్ తన ప్రచార రథానికి కూడా వారాహి అమ్మవారి పేరే పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టారు. స్వతహాగా ఆవేశపరుడైన పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష చేపట్టాక చాలా సౌమ్యంగా కనిపిస్తున్నాడు. పవన్ వ్యవహార శైలిలోనే కాకుండా మాటతీరులో కూడా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. మరి, ఈ మార్పు వారాహి దీక్ష వల్ల వచ్చిందా లేక డిప్యూటీ సీఎంగా కొత్త బాధ్యతలు చేపట్టడం వల్ల వచ్చిందా అన్న చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో.