వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగలేదు కదా : పవన్ కల్యాణ్

రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థపై మరోసారి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024, జూలై 1వ తేదీ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. వలంటీర్లు లేకపోతే రాష్ట్రంలో పెన్షన్లు ఆగిపోతాయని తప్పుడు ప్రచారం చేశారని.. నేడు వలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిలేదు కదా అని అన్నారు. రెట్టింపు పెన్షన్‌ను కూడా సచివాలయ ఉద్యోగులు.. ఇళ్లకు వచ్చి మరీ ఇస్తున్నారని చెప్పారు.

Also Read:ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు

గతంలో పెన్షన్ల పంపిణీ 4-5 రోజులపాటు జరిగేదన్నారు. ఇవాళ రాత్రి లేదా మంగళవారం ఉదయంలోగా 100 శాతం పెన్షన్లు ఇస్తామని ఆయన అన్నారు. వలంటీర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి ఎలా కల్పించాలన్న దానిపై ఆలోచిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.