
అప్పుడెప్పుడో ‘అజ్ఞాతవాసి’ సినిమాతో వెండితెర మీద కనిపించాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అయిపోయి సినీ ప్రియులందరికీ పూర్తిగా దూరమైపోయాడు. కానీ ఎట్టకేలకి అభిమానుల ఆశ ఫలించింది. ఆయన మళ్లీ తిరిగొచ్చాడు. ముఖానికి మేకప్ వేసుకుని కెమెరా ముందు సూపర్ హిట్ ‘పింక్’ రీమేక్‌తో త్వరలో రానున్నాడు. ఎప్పుడెప్పుడు ఆయన్ని తెరమీద చూద్దామా అని ఆరాటపడుతున్న ఫ్యాన్స్ కోసం ఓ గుడ్ న్యూస్ చెప్పాడు తమన్. త్వరలో ఈ సినిమాలోని పాట రిలీజ్ కానుంది. ఎప్పటినుంచో పీకేతో కలిసి పని చేయాలనే ఆశ నెరవేరిందంటూ ఇటీవలే తన ఎక్సయిట్‌మెంట్‌ను తెలియజేసిన తమన్.. ‘మొదటి పాటను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా అని ఆతృతపడుతున్నాను. టీమ్ అంతా చాలా కష్టపడుతోంది. పవర్‌స్టార్‌కి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం’ అంటూ రీసెంట్‌గా ట్వీట్ చేశాడు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఆ పాటను సిద్ శ్రీరామ్ పాడుతున్నట్లు ఆల్రెడీ చెప్పాడు. పవన్ మిలిటరీ టోపీ పెట్టుకున్న లోగోను కూడా పోస్ట్ చేశాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్, క్రిష్‌ల దర్శకత్వంలో కూడా పీకే నటిస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ సినిమా విషయంలో కూడా అందరూ ఎక్సయిటెడ్‌గా ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ అని, బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రామ్ పాల్ విలన్ అని వార్తలు రావడంతో క్యూరియాసిటీ మరింత పెరిగింది. కాకపోతే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. తమన్ పాటతో పాటు సినిమా గురించి ఇతర వివరాల కోసం కూడా ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.
For More News..