తీరం చేరిన యుద్ధనౌక.. గద్దర్పై పవన్ ప్రత్యేక కావ్యం

ప్రజా గాయకుడు, విప్లవ వీరుడు గద్దర్‌(77) ఆగష్టు 6న తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని తెలంగాణ ప్రజలతో పాటు.. ప్రతిఒక్కరు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గద్దర్ తో ఎంతో  ఆప్యాయంగా ఉండే పవన్ కళ్యాణ్ అయితే.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజా గాయకుడికా పవన్ గద్దర్ ను ఎంతో గౌరవించేవారు. సొంత అన్నలా భావించేవారు. అలాంటి వ్యక్తి మరణవార్త విన్న వెంటనే పవన్ గద్దర్ భౌతికకాయం వద్దకు చేరుకొని కన్నీటి పర్యంతమయ్యారు. 

ALSO READ :త్వరలో కొత్త ప్రపంచంలోకి.. ప్రభాస్ సినిమా సాలిడ్ అప్డేట్

ఆ భాదలోనే గద్దర్ పై ఒక కావ్యం చెబుతూ ప్రత్యేక వీడియోని షేర్ చేశారు. గుండెకు గొంతు వస్తే, బాధకు బాష వస్తే గద్దర్. అన్నిటికి మించి నా అన్న గద్దర్.. తీరం చేరిన ప్రజా యుద్ధనౌకకు.. జోహార్.. అంటూ ఎమోషనల్ వీడియోని పవన్ తన ఇన్‌స్టాగ్రామ్ లో ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఇక గద్దర్ కూడా పవన్ కళ్యాణ్ పై తనకున్న ఇష్టాన్ని ఎన్నో సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. తాను ఏ కష్టంలో ఉన్నా.. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా.. పవన్ జేబులో చేయి పెట్టి డబ్బులు తీసుకునే వాడినని, పవన్ తో అంతటి చనువు ఉందని చెప్పుకొచ్చారు గద్దర్. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan)