అల్లు అర్జున్ ను కలవకుండానే హైదరాబాద్ నుండి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..

అల్లు అర్జున్ ను కలవకుండానే హైదరాబాద్ నుండి వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్..

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య శుక్రవారం ( డిసెంబర్ 13, 2024 ) అరెస్టైన బన్నీ ఒకరోజు తర్వాత శనివారం ( డిసెంబర్ 14, 2024 ) మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యాడు.ఈ క్రమంలో అల్లు అర్జున్ ని కలిసి పరామర్శించేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా క్యూ కట్టారు. ఇదిలా ఉండగా..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ని కలిసి పరామర్శిస్తారని... ఇందుకోసం పవన్ గన్నవరం నుండి హైదరాబాద్ కు బయలుదేరారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి.

Also Read : చిరంజీవి ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్.. ఇందుకే వెళ్లాడు..!

అయితే.. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ను కలవకుండానే హైదరాబాద్ నుండి గన్నవరం బయలుదేరినట్లు తెలుస్తోంది.. శనివారం రాత్రి హైదరాబాద్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ఇవాళ తిరిగి గన్నవరం వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారని సమాచారం.

దీంతో అల్లు అర్జున్ ను కలవకుండానే పవన్ కళ్యాణ్ గన్నవరం వెళ్లారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 
మొదట పవన్ అల్లు అర్జున్ ని కలిసి పరామర్శిస్తారంటూ ప్రచారం జరగటం, ఆ తర్వాత బన్నీని కలవకుండానే పవన్ గన్నవరం బయలుదేరటం పట్ల ఫ్యాన్స్, కార్యకర్తలు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.