పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తమిళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తమిళ సినీ ఇండస్ట్రీలో నచ్చిన డైరెక్టర్ ఎవరు అనే ప్రశ్న పవన్ కల్యాణ్‍కు ఎదురైంది. ఈ నేపథ్యంలో పవన్ రియాక్ట్ అవుతూ.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ స్టైల్ తనకు ఇష్టమని పవన్ అన్నారు.
రీసెంట్గా ఆయన డైరెక్షన్లో వచ్చిన దళపతి విజయ్ హీరోగా నటించిన లియో మూవీని తాను చూశానని.. ఆయన సినిమాల్లోని ఆ డిఫరెంట్ నేచర్ అంటే నచ్చుతుందని చెప్పారు. అలాగే దిగ్గజ డైరెక్టర్ మణిరత్నం సినిమాలు అంటే కూడా తనకు ఇష్టమని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో లోకేష్ కనగరాజ్‌తో ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, గతంలో పవర్ స్టార్‌కు లోకేశ్ స్టోరీ నరేట్ చేశారని కూడా పుకార్లు బాగా వినిపించాయి. అయితే అది సాధ్యం కాలేదు. ఈ ప్రాజెక్టుపై ఇంకా ఎలాంటి వివరాలు బయటికి రాలేదు.మరి ఫ్యూచర్ లో అది సాధ్యమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.
ALSO READ | Thalapathy69: విజయ్‌కు విలన్‌గా.. స్టార్ విలన్ బాబీ డియోల్
కాగా, తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు (Yogi Babu) యాక్టింగ్, ఆ హ్యూమరస్ పర్ఫార్మెన్స్ అంటే తనకు బాగా ఇష్టమని కూడా పవన్ కల్యాణ్ చెప్పారు. అతడు ఓ గ్రామానికి ప్రెసిడెంట్ అయ్యే ఓ మూవీని ఇటీవలే చూశానని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
జ్యోతికృష్ణ డైరెక్షన్ లో హరి హర వీరమల్లు మూవీ షూటింగ్‍ను పవన్ ఇటీవలే మళ్లీ షురూ చేశారు. ఈ మూవీని 2025 మార్చి 28న మేకర్స్ రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ డైరెక్షన్ లో ‘ఓజీ’ సినిమాలు ఉన్నాయి.
ఇకపోతే, డైరెక్టర్ లోకేశ్ ప్రస్తుతం చాలా సక్సెస్‍ఫుల్ దర్శకుడిగా ఉన్నారు. తన మార్క్ యాక్షన్ చిత్రాలతో స్టార్ హీరోలతో వరుస హిట్‍లు కొడుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ తో కూలీ సినిమా తెరకెక్కిస్తున్నారు.
I like Yogibabu's performance. I have seen the film #Leo directed by @Dir_Lokesh.
— Satya (@YoursSatya) October 1, 2024
- AP Dy CM @PawanKalyan. pic.twitter.com/w7VztkD712