
ఏపీలోని వాలంటీర్లపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గొంతులు కోసే దండుపాళ్యం బ్యాచ్‌కు, వాలంటీర్లకు తేడా ఏమీ లేదని పవన్ అనడం సంచలనం సృష్టిస్తోంది.
ఆగస్టు 12 న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాలంటీర్ల గురించి తాను ఊహించిందే జరిగిందని.. ఇళ్లల్లోకి చొరబడి ఒంటరి మహిళల గొంతులు కోస్తున్నారని ఆరోపించారు. నవరత్నాలు అమలు చేసేందుకు సీఎం జగన్ నియమించిన ప్రైవేటు సైన్యంగా వారు మారారని ఆక్షేపించారు.
దండుపాళ్యం బ్యాచ్ కు @YSRCParty బ్యాచ్ కు తేడా లేకుండా పోయింది. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారు - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.#HelloAP_ByeByeYCP #VarahiVijayaYatra pic.twitter.com/03nNTadd0Y
— SenaMedia (@TeamSenaMedia) August 12, 2023
పాస్‌పోర్టు కావాలన్నా పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా మారిన ఈ రోజుల్లో వాలంటీర్ల నియామకంలో కనీసం ఆ నిబంధనని పాటించకపోవడంతో క్రిమినల్ కేసులు ఉన్న వారు ఉద్యోగాలు పొందారని అన్నారు.
తనపై విధించిన ఆంక్షల్ని వాలంటీర్లపై విధిస్తే రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరిగేవి కావని వ్యాఖ్యానించారు. అన్ని విషయాలపై జగన్ దే తప్పని అనలేమని.. వ్యవస్థలో తప్పులున్నప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అని హితవు పలికారు.