తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం రాత్రి సమయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే దాదాపుగా 60మందికిపైగా గాయపడగా భాదితులని చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. దీంతో సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రభుత్వ అధికారులు మృతుల కుటుంబాలకి రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు.
గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తిరుపతిలోని రుయా హాస్పిటల్ కి వెళ్ళాడు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పవన్ ని చూసేందుకు భారీగా హాస్పిటల్ వద్దకి వచ్చారు. దీంతో పోలీసులు ఫ్యాన్స్ ని అదుపు చేసేందుకు యత్నించినప్పటికీ కుదర్లేదు. ఈ క్రమంలో పవన్ వచ్చింది భాదితులని పరామర్శించడానికి, మీటింగ్ కి కాదని చెప్పనప్పటికీ ఫ్యాన్స్ వినలేదు.
ALSO READ | తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
దాంతో పవన్ కళ్యాణ్ మైక్ అందుకుని మనుషులు చచ్చిపోయారు... మీకు బాధనిపించట్లేదా అంటూ ఫ్యాన్స్ పై సీరియస్ అయ్యాడు. ఇది ఆనందించే సమయం కాదని, సంఘటన జరిగాక కూడా మీకు భాద్యత లేకపోతే ఎట్లా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ విషయం ఇలా ఉండగా ఈమధ్య పవన్ ఎక్కడికెళ్లినా సినిమా అప్డేట్స్ అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారు. దీంతో పవన్ బయటికి వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.