పవన్ మ్యాజిక్ రిపీట్.. ఇరగదీసిన నాగ శౌర్య, జానీ

యంగ్ హీరో నాగ శౌర్య(Naga shourya) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali). కొత్త డైరెక్టర్ పవన్ బసంశెట్టి(Pawan basamsetty) తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్. ఇక మొదటి నుండి ఈ సినిమా ప్రమోషన్స్ వెరైటీగానే ప్లాన్ చేశారు మేకర్స్. 

ఇందులో భాగంగా తాజాగా పవన్ కళ్యాణ్(Pawan kalyan) క్రేజ్ ను వాడేస్తున్నారు రంగబలి టీమ్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జానీ(Johnny) సినిమాలో "నారాజు గాకురా మా అన్నయ.." సినిమా పాటకు నాగ శౌర్య, జానీ మాస్టర్(Jani ,master) డాన్స్ చేసిన వీడియోను విడుదల చేశారు మూవీ టీమ్. ఆ పాటకు ఈ ఇద్దరూ వేసిన మాస్ స్టెప్స్ ఆడియన్స్ ను తెగ ఎంటర్టైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఫుల్లుగా షేర్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.

ఇక రీసెంట్ టైమ్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసింది రంగబలి మూవీ. ప్రస్తుతం నాగ శౌర్యకు కూడా మంచి అవసరం. చలో తరువాత.. నాగ శౌర్యకు హిట్ పడలేదు. ఇప్పుడు రంగబలితో హిట్ పడటం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా నాగ శౌర్యకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వనుందో చూడాలి.