వైసీపీకి పవర్ లేదని.. పవర్ తన దగ్గర ఉందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన పవన్..‘‘ఫ్యాన్ ను ఆపాలంటే ఏం అవసరం లేదు.. వైసీపీకి పవర్ లేదు.. మన దగ్గర ఉంది పవర్.. ఫ్యాన్ తిరగదు. నెల్లూరులో ఉన్న వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలా బెట్టింగ్ ఎక్స్పర్ట్ లా? జెండా ఏ వైపు ఎగురుతాది అనే వాటి పైన కూడా బెట్టింగులు ఆడుతారు. మీకెందుకు రాజకీయాలు క్లబ్బుల్లో కూర్చుని పేకాట, బెట్టింగులు ఆడుకోండి. పోలీసులపైన కూడా రౌడీయిజం చేస్తారా మీరు. టీడీపీ, వైసీపీ నాయకులు నెల్లూరు జిల్లాలో బెట్టింగుల కోసం కలలు కంటుంటే.. మన నెల్లూరు రూరల్ అభ్యర్థి మనుక్రాంత్ రెడ్డి ఐటీ కంపెనీ పెట్టి ఉపాధి కలిపిస్తుంటే, నెల్లూరు సిటీ అభ్యర్థి వినోద్ రెడ్డి నెల్లూరు సమస్యలు పైన పోరాటం చేశాడు.
అనీల్ కుమార్ యాదవ్ నా అభిమాని అని చెప్తాడు. రెండు మూడు సార్లు కలిశాడు. నువ్వు బెట్టింగులు మానేసి చెప్పు నా అభిమాని అని. నారాయణను వదిలేదు లేదు. అందరికీ ఆయన మంత్రి నారాయణ ఏమో నాకు మాములు నారాయణ. రొట్టెల పండుగకు నేను వస్తే నన్ను రానివ్వకుండా ప్రయత్నం చేస్తారా. ఇది మా అమ్మ సొంత ఊరు. ఫతేఖాన్ పేట, మూలాపేట, టెక్కేమిట్టా ప్రతి దగ్గర నాకు కావాల్సిన మనుషులు ఉన్నారు. నారాయణ విద్యాసంస్థలు, హాస్పిటల్ లు, వ్యాపారులు అన్నీ నెల్లూరు మొత్తం నారాయణ తన సొంతం అనుకుంటున్నాడు‘ అని పవన్ అన్నారు.