హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. రీసెంట్ గా భీమ్లా నాయక్ తో ఆడియన్స్ ను పలకరించిన ఈ స్టార్ హీరో.. వరుస మూవీలతో వారిని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’, హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాలను లైన్ లో పెట్టాడు. వీరమల్లు కథ మొగల్ చక్రవర్తుల కాలంలో నడుస్తుంది. ఆ కాలంలో యుద్ధ విద్యలు తెలిసిన గజదొంగ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు.
Here's a sneak peek into actor @PawanKalyan's training for an action sequence for his upcoming film #HariHaraVeeraMallu! pic.twitter.com/vXZP5I9cdu
— Silverscreen India (@silverscreenin) April 7, 2022
ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న వీరమల్లు మూవీకి సంబంధించిన కొత్త షెడ్యూల్ ఏప్రిల్ 8 నుంచి మొదలుకానుంది. అయితే ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్లు తీస్తారని తెలుస్తోంది. మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉన్న పవన్.. మరింత ఆసక్తితో కోచ్ టొడోర్ లజరోవ్ ఆధ్వర్యంలో యుద్ధ విద్యలను నేర్చుకుంటున్న ఫొటోలు బయటకొచ్చాయి. ఈటె లాంటి ఓ ఆయుధంతో పవన్ చేస్తున్న విన్యాసాలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన ‘పంచమి’ పాత్రలో నిధి అగర్వాల్ కనిపించనుంది. అర్జున్ రాంపాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సీనియర్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు.
మరిన్ని వార్తల కోసం: