
ఖమ్మంజిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో అగ్ని ప్రమాదంలో మరణించిన,గాయపడిన కుటుంబ సభ్యులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీడియో కాల్ చేసి పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని.. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏదైనా అన్యాయం జరిగితే తనకు ఫోన్ చేయాలని పవన్ సూచించారు. తమను సంప్రదించకుండానే మృతులకు పోస్ట్ మార్టం చేశారని.. తమను ఆదుకోవాలని బాధితులు పవన్ తో చెప్పారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడులో ఏప్రిల్ 12న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన అగ్నిప్రమాద బాధితుల కుటుంబాన్ని జనసేన తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి పరామర్శించారు. ఈ క్రమంలో బాధితులతో పవన్ ఫోన్ లో మాట్లాడించారు.
https://twitter.com/JSPTelangana/status/1646486194514202624